‘భారతీయుడు 2’లో సరైన హీరోయిన్‌

bharateeyudu 2 movie heroine nayanthara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం ‘2.0’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఏప్రిల్‌లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘2.0’ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఒక వైపు రజినీకాంత్‌ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న శంకర్‌ మరో వైపు కమల్‌ హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌’ చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు కొనసాగింపు చేయాలని కొన్ని సంవత్సరాలుగా శంకర్‌ భావిస్తున్నాడు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చబోతుంది.

ఈ వేసవిలో కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ ‘భారతీయుడు 2’ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. తెలుగు మరియు తమిళంతో పాటు అన్ని ఇండియన్‌ భాషల్లో ముఖ్యంగా హిందీ భాషలో విడుదల చేసేందుకు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే యోచనలో దర్శకుడు శంకర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. శంకర్‌ సినిమాల్లో హీరోయిన్స్‌కు చాలా కీలక పాత్ర ఉంటుంది. అందుకే నయనతారను ఈ చిత్రం కోసం ఎంపిక చేయాలని నిర్ణయించారు. కమల్‌కు జోడీగా నయనతార నటిస్తే సినిమా స్థాయి పెరిగి పోవడం ఖాయం అని తమిళ సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ఛాలెంజింగ్‌ పాత్రలను చేయాలని కోరుకునే నయనతార వెంటనే శంకర్‌ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యింది. 2019 వేసవిలో ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.