బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన ఆమె సెట్స్‌లో అడుగుపెట్టిందని, జన్మనిచ్చిన 12 రోజులకే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోజుల బిడ్డనే అలా వదిలేసి డబ్బు కోసం షూటింగ్‌లో పాల్గొనడం అసలు బాగోలేదు అంటూ ఆమెను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీ సింగ్ ఈ ట్రోల్స్‌పై స్పందించింది.
రీసెంట్‌గా ఖత్రా ఖత్రా షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘పసిబిడ్డ వదిలేసి అప్పుడే వచ్చావా? అంత తొందర ఏముందని చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు రావడం సాధారణమే. కానీ మనం పాజిటీవిటి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అందరిలా.. కొందరికి విశ్రాంతి తీసుకునే పరిస్థితులు లేకపోవచ్చు. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే వారు తిరిగి పనిలో నిమగ్నమవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే తన కొడుకును చూసుకునేందుకు ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారని, బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడని స్పష్టం చేసింది. ‘ఖత్రా ఖత్రా షో మా డ్రీమ్ ప్రాజెక్ట్. మేం దాన్ని వదులుకోలేము. ‘‘అందరు ‘బేబీ చాలా చిన్నది.. అలా ఎలా వదిలేసి వస్తుందంటున్నారు’. అయితే నా బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడు. నా కొడుకు స్యయంగా నా పాలనే పట్టిస్తున్నాను’’ అని భారతీ సింగ్ వివరణ ఇచ్చింది. కాగా భారతీ గర్భవతి సమయంలో కూడా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. చెప్పాలంటే తను బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు వరకూ కూడా షోను హోస్ట్ చేసింది.