“భోలే భార్య : శోభ, ప్రియాంకను ఖండించారు”

"భోలే భార్య : శోభ, ప్రియాంకను ఖండించారు"
Cinema News, Entertainment

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ సింగర్‌ భోలే షావలి బయటకు వచ్చారు . వైల్డ్‌ కార్డ్‌తో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే తన ఆటతీరుతో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌కు తన మాటలు, పాటలతో పట్ట పగలే చుక్కులు చూపించారు . ఇక నామినేషన్స్‌ వచ్చినప్పుడల్లా శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, భోలేల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగేది . ముగ్గురి మధ్య మాటల తూటాలు అయ్యేవి . ఈ నేపథ్యంలో శోభా, ప్రియాంక జైన్‌ భోలే షావలిని చిన్న చూపు చూశారంటూ అతని భార్య సీమ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలే ఎలిమినేట్‌ అయ్యి వచ్చిన భోలే గురించి, హౌజ్‌లో అతని ఆటతీరు గురించి సీమ బాగా స్పందించింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు భోలేతో శోభ, ప్రియాంకల గొడవల విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ‘ నా భర్త (భోలే) ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునే రకం కాదని, ఏదైనా పాట రూపంలోనే రియాక్ట్‌ అవ్వడం ఆయనకు ఒక అలవాటు. నా భర్త బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు శోభ శెట్టి దారుణంగా మాట్లాడింది. భోలేను తక్కువ చేసి చూసింది. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో నా భర్త బట్టల గురించి శోభ నోటికొచ్చినట్లు మాట్లాడింది. నీ బట్టలు చూస్తేనే నీ గురించి అర్థమవుతుందని కామెంట్స్‌ చేసింది. ఇక ప్రియాంక అయితే ‘థూ’ అని కూడా అనింది . ఆ రోజు వాళ్ల మాటలు విని మేమంతా చాలా బాధపడ్డాం’ అని ఎమోషనల్‌ అయ్యింది భోలే భార్య సీమా .

"భోలే భార్య : శోభ, ప్రియాంకను ఖండించారు" - Telugu Bullet

‘శోభ, ప్రియాంకలు అన్ని మాటలన్నా నా భర్త సహనంగానే ఉన్నాడు. అదే రోజు రాత్రి వెళ్లి వాళ్లకు సారీ చెప్పాడు. ‘సారీ అమ్మా .. క్షమించమ్మా’ అని అడిగాడు. అయినా శోభా తీసుకోలేదు. ‘నీ క్షమాపణలు ఎవరికీ కావాలి? నువ్వెవరికి కావాలి? నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తుంది’ అని దారుణంగా మాట్లాడింది. ఏదో ఒక కారణం చెబుతూ ప్రతిసారి మా ఆయనను నామినేట్‌ చేసింది శోభా . శోభ, ప్రియాంకలు వ్యవహరించిన తీరు దారుణం. వారిద్దరికి అహంకారమెక్కువ’ అని అంటూ చెప్పుకొచ్చింది సీమ.