Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో వీరిద్దరూ సమానస్థాయి గల నేతలు. పోట్లాడుకున్నా, కొట్లాడుకున్నా అదో కిక్కు. కానీ భూమా చనిపోయాక శిల్పా మోహన్ రెడ్డికి సమఉజ్జీ లేకుండా పోయారు. గతంలో భూమా శత్రువైనా.. అవసరమైనప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడేవారు శిల్పా. కానీ ఇప్పుడు అఖిలప్రియ మంత్రి అయ్యాక వ్యవహారం మారిపోయింది. ఆమె ఎవర్నీ లెక్కచేయకపోవడం.. శిల్పాకు భవిష్యత్ పై ఆందోళన కలిగించింది.
అందుకే హఠాత్తుగా పార్టీ మారారు శిల్పా. అందరూ అనుకున్నట్లు టికెట్ కోసం పార్టీ మారలేదని, రాజకీయ భవిష్యత్ కోసమే గోడ దూకానని శిల్పా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అఖిలప్రియ తన కూతురి లాంటిదని, కానీ ఆమె మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయని శి్ల్పా సన్నిహితుల దగ్గర మండిపడ్డారట. అసలు ఆ అమ్మాయికి ఎవర్నీ గౌరవించడం తెలీదని, బాబుకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారట.
అఖిలప్రియ మంత్రి అయిన దగ్గర్నుంచి శిల్పాలో మొదలైన అసంతృప్తి.. మెల్లగా పెరిగి చివరకు పార్టీ మారేలా చేసింది. దీంతో చంద్రబాబు కూడా అలెర్టయ్యారు. అఖిలప్రియను పిలిపించిన చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారట. మంత్రి పదవిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి పార్టీకి చెడ్డపేరు తేవొద్దని హెచ్చరించారట. నియోజకవర్గంలో సీనియర్లను కలుపుకోవాలని సూచించారట. అందుకే ఇటీవలి కాలంలో అఖిలప్రియ కూడా కాస్త తగ్గి ఉంటున్నారని చెబుతున్నారు టీడీపీ నేతలు.