‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’లో ఏదో తేడా కొడుతుంది..!

Bhumika as sister-in-law to Nani in MCA movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్‌గా నటించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది అంటూ తాజాగా దిల్‌రాజు మరోసారి ప్రకటించాడు. ఈ సందర్బంగా దిల్‌రాజు స్టోరీ లైన్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఒక మిడిల్‌ క్లాస్‌ ఇంట్లో వదిన, మరిది మద్య జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనలు మరియు సన్నివేశాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పుకొచ్చాడు. దిల్‌రాజు చెప్పినప్పుడు సరే అనుకున్నారు కాని, తాజాగా విడుదలైన కొన్ని పోస్టర్‌లు చూస్తుంటే సినిమా ఏదో తేడా కొడుతుంది అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లను చూస్తుంటే పాత చిత్రాలు గుర్తుకు వస్తున్నాయి. వదిన భూమిక వెనుక నాని నడవడం, వదిన అడుగు జాడల్లో నడవడం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందని, సినిమా ఫలితం తారు మారు అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వదిన మరిదిల నేపథ్యంలో కథ అంటే కాస్త వినడానికి కొత్తగా ఉంది. గతంలో ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. మొత్తానికి ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం ఇన్నాళ్లు చాలా ఆసక్తి రేపింది. తాజాగా అసలు విషయం రివీల్‌ అవ్వడంతో కాస్త ఆసక్తి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే సాయి పల్లవి ఈ చిత్ర స్థాయిని పెంచే విధంగా ఉంటుందని, తప్పకుండా సినిమా కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందని, తమ బ్యానర్‌లో ఈ సంవత్సరం ఆరవ విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందనే నమ్మకంతో దిల్‌రాజు ఉన్నాడు. నానికి వరుసగా విజయాలు, దిల్‌రాజుకు వరుసగా విజయాలు వస్తున్న ఈ సమయంలో విడుదల కాబోతున్న ఎంసీఏ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.