Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటి భువనేశ్వరి. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా భువనేశ్వరి కెరీర్ కొనసాగింది. ఇటీవల భువనేశ్వరి సినిమాలకు దూరం అయ్యింది. అడపా దడపా సినిమాల్లో మాత్రమే ఆమె నటిస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. అవకాశాలు రాకపోవడంతో తమిళనాడులో కుటుంబంతో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న భువనేశ్వరి మరోసారి మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈసారి ఆమె కొడుకు కారణంగా భువనేశ్వరి మీడియాలో వార్త అయ్యింది. గతంలో ఒకసారి చీటింగ్ కేసులో భువనేశ్వరి తనయుడు మిథున్ శ్రీనివాసన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా మరోసారి అమ్మాయిని వేదించిన కేసులో అరెస్ట్ అయ్యాడు.
23 ఏళ్ల మిథున్ ఇటీవల ఫేస్బుక్లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మిథున్‌తో ఫ్రెండ్లీగా ఉండేది. అయితే మిథున్ ఆమెను ప్రేమించమంటూ వేదించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుందామంటూ బలవంతం చేస్తున్నాడు. ఆమె ప్రేమకు పెళ్లికి నో చెప్పడంతో ఆగ్రహంతో ఆమె ఇంటికి వెళ్లి నానా హంగామా చేశాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కూతురును ఇబ్బంది పెడుతున్నాడని, ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు అంటూ మిథున్‌పై వారు కేసు పెట్టడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మిథున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం కేసు విచారిస్తున్నారు. మిథన్ కేసు కోర్టుకు వెళ్లడం, జైలు శిక్ష పడటం ఖాయం అంటూ స్థానికులు చెబుతున్నారు.