బైడెన్, జిన్​పింగ్ 4 గంటలపాటు భేటీ.. కలిసి సాగాలని నిర్ణయం

Biden and Xi Jinping met for 4 hours.. It was decided to go together
Biden and Xi Jinping met for 4 hours.. It was decided to go together

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ఆరేళ్ల తర్వాత అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా – పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు హాజరైన జిన్‌పింగ్‌ ఆ సదస్సు తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన ఇరు దేశాధ్యక్షులు ఇక నుంచి కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, వాణిజ్యం, తైవాన్‌ అంశం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడుల వంటి పలు అంశాలపై చర్చించారు. బైడెన్‌ తన అభిప్రాయాలను, ఆందోళనలను జిన్‌పింగ్‌కు ఎలాంటి మొహమాటం నేరుగా చెప్పేశారని వైట్‌ హౌస్‌ తెలిపింది.

ఈ భేటీ అనంతరం అమెరికా-చైనా మధ్య సైనిక సంబంధాలు పునరుద్ధరణకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. శాంతిని స్థాపిస్తూ.. విజయం సాధించేందుకు పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుదామని బైడెన్‌కు.. జిన్‌పింగ్‌ సూచించినట్లు తెలిసింది. ఈ విజ్ఞప్తికి బైడెన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ మాట్లాడుతూ.. అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తెలిపారు.