బిగ్‌ బాస్‌-3 నిర్వాహకులకు హైకోర్టులో ఊరట

big boss 3 show organisers gets relief in high court

బిగ్‌బాస్‌-3 షో నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్‌ షో నిర్వాహకుడు అభిజిత్ ముఖర్జీ తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతవరకు అరెస్ట్ లాంటి చర్యలేవి చేపట్టవద్దని పోలీసులకు నిర్దేశించింది.

ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24 కి వాయిదా వేసింది. యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పీఎస్ లో, నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్‌స్టేషన్లో బిగ్‌బాస్‌ షో నిర్వాహకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.