క్యాన్స‌ర్ వ‌ల‌న 26 కిలోల బ‌రువు త‌గ్గానంటున్న రిషి

rishi kapoor lost 26 kgs because of cancer

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రిషి క‌పూర్‌కి క్యాన్స‌ర్ సోకింద‌న్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్‌లో ఉండ‌గా, అస్వ‌స్థ‌తో బాధ‌ప‌డుతున్న అత‌నిని ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా క్యాన్స‌ర్ అని తేలింది. దీంతో వెంట‌నే రిషిని న్యూయార్క్‌కి త‌ర‌లించి మెరుగైన వైద్యం అందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు. అయితే ట్రీట్‌మెంట్‌లో భాగంగా నాలుగు నెల‌ల పాటు ప‌స్తులు ఉన్న అత‌ను 26 కేజీల బ‌రువు త‌గ్గార‌ట‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 8 కేజీల బ‌రువు పెరిగార‌ట‌. బ‌క్క‌గా ఉండ‌టం త‌న‌కి ఇష్టం లేద‌న్న రిషి త్వ‌ర‌లోనే మ‌ళ్ళీ పాత లుక్‌లోకి వ‌స్తానంటున్నారు. ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో కోలుకుని ముంబైకి వచ్చేస్తానని పేర్కొన్నాడు. తాను ఇంత త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి కార‌ణం నా కుటుంబం, పిల్ల‌లు, అభిమానులు, దేవుడి ద‌య‌. ముఖ్యంగా నా భార్య నీతు. తాను ఫోర్స్ చేయ‌క‌పోతే నేను న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకోక‌పోయేవాడిని. నా పిల్ల‌లు ర‌ణ్‌బీర్, రిధిమా కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. నా ఆరోగ్యం గురించి ప్రార్ధించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్రత్యేక ధ‌న్య‌వాదాలు. ఒపిక త‌క్కువ‌ ఉండే నాకు ఇప్పుడు ఓపిగ్గా ఎలా ఉండాలో దేవుడు ఈ రకంగా తెలియ‌జేశాడు అని రిషి కపూర్ ఇటీవ‌ల‌ పేర్కొన్నాడు ఆయ‌న నటించిన జూతా కహీ కా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.