ఇంద్రసేన బిచ్చగాడిని చేసింది

Big loss for Indrasena Movie distributors and producer neelam krishna reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళ హీరోలు తెలుగులో సక్సెస్‌ అవ్వడం చాలా సంవత్సరాలుగా సాగుతుంది. అయితే కొందరు హీరోలు సక్సెస్‌ను కంటిన్యూ చేస్తే కొందరు మాత్రం ఒకటి రెండు సక్సెస్‌లతో కనుమరుగవుతారు. తమిళంకు చెందిన విజయ్‌ ఆంటోని తెలుగులో వరుసగా చిత్రాలను విడుదల చేస్తున్నాడు. తమిళంలో ఈయన నటించిన చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ అనే టైటిల్‌తో డబ్‌ చేశారు. ఆ సినిమా చిన్న చిత్రాల్లో బాహుబలి స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ విజయంతో విజయ్‌ ఆంటోనీ తన చిత్రాలు అన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నాడు.

తాజాగా తమిళంలో చేసిన చిత్రాన్ని తెలుగులో ‘ఇంద్రసేన’గా విడుదల చేయడం జరిగింది. టైటిల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. చిరంజీవి హిట్‌ చిత్ర సినిమాలో పేరు అవ్వడంతో సినిమాపై సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని నిర్మాత నీలం కృష్ణారెడ్డి దాదాపు 3.5 కోట్లు పెట్టి విడుదల చేశాడు. డబ్బింగ్‌ రైట్స్‌కు భారీగా ఖర్చు చేసిన నిర్మాత పబ్లిసిటీ కోసం చాలా ఎక్కువ ఖర్చు చేశాడు. ఇంద్ర సేన పబ్లిసిటీకి చాలా ఎక్కువ ఖర్చు అవ్వడంతో నిర్మాత భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నాడు. 3.5 కోట్లు పెట్టుబడి పెట్టగా కనీసం 75 లక్షల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ రాలేదని సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా లాస్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. నిర్మాత దాదాపు రెండు కోట్ల మేరకు నష్టపోయి ఉంటాడు అని సమాచారం అందుతుంది. మొత్తానికి ఇంద్రసేన చిత్రం నిర్మాతను బిచ్చగాడిగా మార్చేసే పరిస్థితి నెలకొంది.