మహిళలకు భారీ షాక్

మహిళలకు భారీ షాక్

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇప్పుడు కొనాలా? లేదంటే మరికొంత కాలం వేచి చూస్తే మంచిదా? అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రానున్న కాలంలో బంగారం ధరలు భారీగా పెరగొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర గత మూడు రోజులుగా పడిపోతూనే వస్తోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,090కు దిగొచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

అయితే ఇతర ఫైనాన్షియల్ అసెట్ కేటగిరిలతో పోలిస్తే బంగారం ధర తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల 2021 చివరి కల్లా పసిడి రేటు ఆల్ టైమ్ గరిష్టానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

పండుగ సీజన్ వస్తుండటం, అమెరికా డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు లేకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో పసిడి రేటు పరుగులు పెట్టొచ్చని వివరించారు. జీవిత కాల గరిష్ట స్థాయి రూ.56,191 స్థాయికి అధిగమించొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి కల్లా పసిడి రేటు ఏకంగా రూ.58 వేల మార్క్‌కు చేరొచ్చని పేర్కొంటున్నారు.