బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి రెండవ వారం జరుగుతుంది మొదటి వారంలో నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవడంతో మిగిలిన సభ్యులు అందరూ చాలా భయంతో జాగ్రత్తగా ఆడుతున్నారు. కాగా సోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి . ఎలిమినేషన్ లో భాగంగా సీరియల్ స్టార్ అమర్ దీప్ సింగ్, గౌతమ్, రతికలు అతనితో వాదించిన తీరు పట్ల నెటిజన్లు వారికీ వ్యతిరేకంగా మారిపోయారు అనేది వాస్తవం.
ఒక రైతు బిడ్డ ఇక్కడ వరకు వచ్చాడన్న ఇది కూడా లేకుండా అతనిని కించపరిచిన తీరు పట్ల చాలా మంది బాధపడుతున్నారు . ఈ ఎపిసోడ్ మాత్రం పల్లవి ప్రశాంత్ కు పాజిటివ్ గా ఉపయోగపడనుంది అని అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ఇంకా రైతుల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సైతం ప్రశాంత్ కు ప్లస్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు
ఇప్పుడు ఈ వీక్ లో ప్రశాంత్ నామినేషన్ లో ఉండగా ఎక్కువ ఓట్లు ఇతనికి వస్తున్నట్లు తెలుస్తుంది .