బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో నిమిషానికో రకంగా మారిపోతున్నారు హౌస్మేట్స్. అప్పుడే నవ్వుతూ కనిపించే కంటెస్టెంట్లు ఆ మరుక్షణమే గొడవలో దూరుతూ కన్నీళ్లు పెట్టుకుంటే మరికొందరేమో బూతులు మాట్లాడుతూ చెవులు మూసుకునేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గొడవలంటే చాలు ఎవరూ తగ్గేదే లే అన్నట్లుగా ఢీ అంటే ఢీ అంటూ ముందుకు దూకుతున్నారు. ఫలితంగా ఏడుపులు, పెడబొబ్బలు ఉండనే ఉన్నాయి.
ఈ క్రమంలో నా మంచితనాన్ని ఆధారంగా చేసుకుని నన్ను చులకన చేస్తున్నారంటూ ఏడ్చేసింది సరయు. హమీదా ఎప్పుడూ తనను చులకన చేస్తూ మాట్లాడుతోందని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అఖిల్ వెళ్లి ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత సరయు నేరుగా హమీదా దగ్గరకు వెళ్లి తన పైన జోకులు చేయొద్దని నొక్కి చెప్పింది. మరోవైపు యాంకర్ శివ పులిహోర కలుపుతూనే ఉన్నాడు. హౌస్‌లో అడుగుపెట్టగానే అరియానాను పొగిడిన ఆయన ఆ తర్వాత బిందు మాధవిని ఫోకస్ చేస్తూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు.
ఇక కెప్టెన్సీ టాస్ఖ్లో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. తాను ఫిజికల్ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చాడు అఖిల్. మరో పక్క నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్ శివ పైపైకి వెళ్లాడు మాస్టర్. దీంతో మిగతా హౌస్మేట్స్ వారిని కూల్ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్, తేజస్వి, నటరాజ్, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి!