బుల్లితెర రియాలిటీ షో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్‌బాస్. ఈ ఆటలో ఉండే మజానే వేరు. ఆడేవారికన్నా చూసేవారికే ఎక్కువ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంటుందీ గేమ్ షో. ఇప్పటిదాకా బుల్లితెరపై సందడి చేసిన బిగ్‌బాస్ తాజాగా టీవీకి బైబై చెప్పేసి ఓటీటీలో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అంటూ కొత్త, పాత కంటెస్టెంట్లతో గేమ్ మొదలుపెట్టింది.
17 మంది కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 26న ఘనంగా ప్రారంభమైందీ షో. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జున బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాకపోతే శని, ఆది వారాల్లో కాకుండా కేవలం శనివారం మాత్రమే వ్యాఖ్యాతగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఈ క్రమంలో నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
గత సీజన్‌కు పది నుంచి పన్నెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న నాగార్జున ఈసారి దాన్ని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హోస్టింగ్ కోసం ఆయన దాదాపు రూ.8-9 కోట్ల మేర తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ నాగ్ హోస్టింగ్‌కు ఆ మాత్రం తీసుకోవడంలో తప్పే లేదంటున్నారు ఆయన అభిమానులు.