బిగ్‌బాస్‌ 2 గురించి ఆసక్తికర విషయం

Bigg Boss Telugu Season 2 starting date and Duration details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు రంగం సిద్దం అయ్యింది. గత మూడు నెలుగా సీజన్‌ 2 హోస్ట్‌ ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే నాని బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను లీడ్‌ చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ షోలో కనిపించబోతున్న పార్టిసిపెంట్స్‌ ఎవరా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పటి నుండి సీజన్‌ 2 ప్రారంభం కాబోతుందనేది చర్చ జరుగుతుంది. మాటీవీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్‌ మూడవ వారం నుండి ఈ షోను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే స్టార్‌ మాటీవీలో రాత్రి 9 నుండి 10 గంటల సమయంలో ప్రసారం అవుతున్న సీరియల్స్‌కు వేరే సమయంను కేటాయించడం జరిగింది. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటనలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం ఎప్పటి నుండో కూడా అదే సమయంలో తెలియజేయనున్నారు. షోపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఇంకాస్త మసాలా దట్టించి ప్రసారం చేయబోతున్నారు. నాని హోస్ట్‌గా ఎలా అలరిస్తాడో అనే అనుమానం కాస్త ఉంది. అయినా కూడా ప్రేక్షకులు బిగ్‌బాస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌ను కేవలం 60 రోజులు మాత్రమే నిర్వహించిన స్టార్‌ మా ఈసారి ఏకంగా 100 రోజులు ప్రసారంకు రంగం సిద్దం అయ్యింది. ప్రైజ్‌ మనీ కూడా ఎక్కువ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జూన్‌ మూడవ వారం కోసం ఎంతోఆసక్తిగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.