నేను అందంగా ఉండనా…?

Niharika about her Love proposals

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆచి తూచి చిత్రాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా జాగ్రత్తగా ఈమె పాత్రలను ఎంచుకుంటుంది. అందుకే ఈమె మొదటి సినిమా విడుదలై ఇంత కాలం అయినా రెండవ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే తమిళనాట ఈమె ఒక చిత్రం విడుదలైంది. మరో సినిమాకు రంగం సిద్దం అవుతుంది. తెలుగులో ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న నిహారిక తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలోనే ఈమె తన ప్రేమ కథల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికి షాక్‌ ఇచ్చింది.

తన వెనుక మెగా ఫ్యామిలీ ఉన్న కారణంగానో లేక మరేంటో కాని నన్ను ప్రేమించేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. నన్ను ప్రేమిస్తున్నా అంటూ ఎవరైనా చెబుతారేమో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఎవరైనా లవ్‌ ప్రపోజల్‌ పెడితే ఇది నా మొదటి లవ్‌ ప్రపోజల్‌ అని చెప్పుకోవాలని భావించాను. కాని ఇప్పటి వరకు నాకు లవ్‌ ప్రపోజల్‌ రాలేదు. అప్పుడప్పుడు నాకు నేను అందంగా లేనా అనే అనుమానం కలుగుతుందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. సెలబ్రెటీ పిల్లలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ఇది కూడా ఒకటి అంటూ నిహారిక నిటూర్చుతుంది. ఇటీవల ఈమెకు ప్రభాస్‌తో పెళ్లి అని, నాగ శౌర్యతో ప్రేమ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అవన్ని కూడా ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చేసింది.