అక్కడికి వెళితే ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇబ్బందేనా ?

Chandrababu and KCR May attends to Kumaraswamy Oath as Karnataka CM ceremony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నాటక రాజాకీయం చివరకు ఒక స్టాండ్ తీసుకుంది. ముందు బీజేపీ గద్దె నెక్కాలని విఫల యత్నం చేసినా న్యాయ బలంతో దానిని కాంగ్రెస్ తిప్పి కొట్టగలిగింది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల తర్వాత ఒక ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తోంది. జేడీఎస్ కంటే చాలా సీట్లు ఎక్కువే గెలిచినా… పొత్తులో భాగంగా ముఖ్యమంమత్రి సీటును కుమారస్వామికి ఇచ్చేస్తున్నా… ఆ పార్టీకి అంతకు మించిన లాభం… జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి కలగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తూ… వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్రమోదీని ప్రధాని కానీయకూడదని తీర్మానించుకున్న ప్రాంతీయ పార్టీలన్నీ కుమారస్వామి ప్రమాణ స్వీకార సభ ద్వారా ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి దీనికి సోనియా, రాహుల్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంటే… ఒక రకంగా… వీరంతా పరోక్షంగా కాంగ్రెస్ కూటమి అనే భావించవచ్చు. వాస్తవంగా చూస్తే చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే నాయకత్వం అనే ప్రశ్నే రాకుండా… నరేంద్రమోదీపై పోరాటం అనే కాన్సెప్ట్ ద్వారానే ప్రస్తుతానికి ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్ ల‌కు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లాలా వ‌ద్దా అనే చ‌ర్చ ఆదివారం నాడు టీడీపీ వ‌ర్గాల్లో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మంత్రుల‌తో చ‌ర్చించిన పిదప హాజ‌రు అవుదామ‌నే నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చిన‌ట్టు ప్రచారం సాగింది. అయితే మరో పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా క‌ర్ణాట‌క వెళ్లేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించిన‌ట్టుగా మొన్న‌నే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా 11 ప్రాంతీయ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, నాలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉండటంతో ఇది కుమారస్వామి ప్రమాణస్వీకారం అనే కంటే కాంగ్రెస్ కూటమి అవగాహనా సదస్సు లా ఉంటుంది.

తెలంగాణ‌లో కేసీఆర్ కి కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం. కానీ ఫెడరల్ ఫ్రెంట్ నేపథ్యంలో జేడీఎస్ తో ఇటీవ‌లే ఒప్పందం కుదిరింది. ఆహ్వానం కుమారస్వామిదే అయినా… కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా కూడా వెళ్లిన‌ట్టు సంకేతాలు వెళ్తాయి. ఇటు చూస్తే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి కూడా అలానే ఉంది మోడీ మీద వ్యతిరేకతతో ఎడ్యూర‌ప్ప రాజీనామా చేయ‌క‌పోతే, జెడీఎస్ కి మ‌ద్ద‌తుగా పోరాటం చేసేందుకు టీడీపీ కూడా సిద్ధ‌మైంది. అలాగే మోడీ కుయుక్తులను తిప్పికొట్టేందుకు సలహాలు ఇచ్చిన చంద్ర‌బాబుకు కుమారస్వామి ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయితే కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ జేడీఎస్ నాయకుని పిలుపు మేరకే వెళుతున్నా కాంగ్రెస్ ప్లాన్ చేసిన కాంగ్రెస్ కూటమి సభ కావడంతో ఇటు ఆంధ్రాలో వైకాపా చేసే విమర్శలకి  తెలంగాణాలో కాంగ్రెస్ చేసే విమర్శలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.