ఆ జాబితాలో చిరు పేరు కూడా వచ్చి చేరింది…!

Bigg Boss Telugu Season 3 Host Chiranjeevi

తెలుగు బిగ్ బాస్ సీజన్1 ను జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు పాల్గొన్న కాంటేస్తేంట్ లు ఇప్పుడు కూడా ఎంతో స్నేహ పూర్వకంగా ఉన్నారు. ఆ తరువాత నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ను షో నిర్వాహకులు ఎంతో ఘనంగా ప్రారంభించారు. ప్రేక్షకులు కూడా సీజన్1, దృష్టిలో పెట్టుకొని సీజన్2 ను పై చాలా ఆశలు పెట్టుకున్నారు. నాని హోస్ట్ గా వచ్చేసరికి సీజన్2 పై భారీ అంచనాలు ఉంటాయని షో నిర్వాహకులు కూడా అంచనా వేశారు. కానీ షో మొదట మంచిగానే నడిచిన ఆ తరువాత కాంటేస్తేంట్ ల మద్య గొడవలతో బిగ్ బాస్ అంటేనే ఇంటరెస్ట్ పోయేలా తయారైంది. బిగ్ బాస్ షో నిర్వాహకులు మరల అటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలని బిగ్ బాస్ ౩ ని ప్లాన్ చేస్తున్నారు.

అందుకోసం టాలీవుడ్ నుండి కొంత మంది సెలబ్రిటీ పేర్లను పరిశిలించినట్లు తెలుస్తుంది. అందులో అల్లు ఆర్జున్, రానా, విజయ్ దేవరకొండ, వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తునాయి. తాజాగా ఈ లిస్టు లోకి మెగా స్టార్ చిరంజీవి పేరుకూడా వచ్చి చేరింది. చిరు మాత్రం సురేందర్ రెడ్డితో సైరా నరసింహా రెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కొరటాల శివ కూడా అన్నయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ తో ఉన్న చిరుని బిగ్ బాస్ షో నిర్వాహకులు వెళ్లి కలిసినట్లు తాజా సమాచారం. ఆల్రెడీ మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి హోస్ట్ గా చేసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. అది దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్౩ కి చిరును సంప్రదించినట్లు సమాచారం. ఇంకా వెంకటేష్ కూడా ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మెగా స్టార్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ గాని ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రం ఫైనలైజ్ చెయ్యాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు.