తెలుగు మాట్లాడిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ట్విస్ట్!

తెలుగు మాట్లాడిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ట్విస్ట్!
Cinema News, Entertainment

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది . ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తైన ఈషో.. ఇప్పుడు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది’ మొత్తం 19 మందితో స్టార్ట్ అవ్వగా .. ఇప్పుడు పది మంది మిగిలారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో బిగ్‏బాస్ షో నడుస్తోంది. తెలుగుకు నాగార్జున, హిందీకి సల్మాన్ ఖాన్, కన్నడ కిచ్చ సుదీప్, తమిళం కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తు ఉన్నారు . అయితే బిగ్‏బాస్ నియమ నిబంధనల ప్రకారం ఈ షోలో కంటెస్టెంట్స్ అందరూ స్థానిక భాష మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిందీ బిగ్‏బాస్ షోలో ఇద్దరు కంటెస్టెంట్ తెలుగులో మాట్లాడుకుంటుండగా.. తెలుగు బిగ్‏బాస్ షోకు మీకు స్వాగతం అంటూ ఫన్ క్రియేట్ చేశాడు బిగ్‏బాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

అసలు విషయం లోకి వస్తే.. ప్రస్తుతం హిందీలో సీజన్ 17 ఆసక్తికరంగా సాగుతోంది . ఇటీవల నామినేషన్లలో భాగంగా హీరోయిన్ మన్నారా చోప్రా, అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీ ఇద్దరూ తెలుగులో సవాలు విసురుకుంటూ ఉన్నారు . నామినేషన్స్ సమయంలో అరుణ్ మాట్లాడుతూ.. చెద్దాం చెద్దాం అన్నీ చెద్దాం అని అనగా.. నాకు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అని మన్నారా చోప్రా మాట్లాడింది. దీంతో బిగ్‏బాస్ తెలుగు షోకు అందరికీ స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు బిగ్‏బాస్. దీంతో కంటెస్టెంట్ అంతా ఠక్కున నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. హిందీ బిగ్‏బాస్ షోలో తెలుగు మాట్లాడటం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతకుముందు పలుమార్లు కంటెస్టెంట్లకు హైదరాబాద్ లైఫ్ స్టైల్, తెలుగు భాషను నేర్పిస్తున్న వీడియోస్ సైతం ఎప్పుడు
నెట్టింట వైరలయ్యాయి..