Election Updates: తెలంగాణలో గంటలోనే ఎక్కడికైనా..7 మార్గాల్లో ర్యాపిడ్‌ రైల్‌ ప్రతిపాదన

Election Updates: Rapid rail proposal in 7 routes to anywhere in Telangana within an hour
Election Updates: Rapid rail proposal in 7 routes to anywhere in Telangana within an hour

హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్​లో ఆయన 2047 హైదరాబాద్‌ విజన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న కాలంలో హైదరాబాద్ నుంచి తెలంగాణలో గంటలోనే ఎక్కడికైనా వెళ్లేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ కారిడార్లు తీసుకువస్తామని తెలిపారు. ORR వరకు మెట్రో, అక్కడి నుంచి ర్యాపిడ్‌ రైల్‌ తీసుకొస్తామని వెల్లడించారు. ఐటీ రంగాన్ని చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు ఇవే..

కండ్లకోయ (ORR)
a) మేడ్చల్‌-మనోహరాబాద్‌, మాసాయిపేట, చేగుంట, మెదక్‌ 70 కి.మీ.
b) చేగుంట-రామాయంపేట, బిక్‌నూర్‌, కామారెడ్డి, డిచ్‌పల్లి,
నిజామాబాద్‌ 103 కి.మీ.
పెద్ద అంబర్‌పేట(ORR)
a) చౌటుప్పల్‌, చిట్యాల్‌- నార్కట్‌పల్లి, నల్గొండ 81 కి.మీ.
b) నార్కట్‌పల్లి, నరిరేకల్‌- సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం 111 కి.మీ.
అప్పా (ORR)- మొయినాబాద్‌, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌ 60 కి.మీ.
ముత్తంగి(ORR)- ఇస్నాపూర్‌, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ 64 కి.మీ.
శామీర్‌పేట (ORR)- గజ్వేల్‌- కొమరవెల్లి-సిద్దిపేట- కరీంనగర్‌ 140 కి.మీ.
ఘట్‌కేసర్‌ (ORR) – రఘునాథపల్లి, బీబీనగర్‌, యాదాద్రి, జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌- వరంగల్‌ 113 కి.మీ.
శంషాబాద్‌ (ORR)- షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ 50 కి.మీ.