బిగ్‌బాస్ అంటేనే కోపాలు, కలిసిపోవడాలు, చిరాకులు, చిలిపి చేష్టలు, ప్రేమలు, పట్టింపులు, టాస్కులు, టఫ్ ఫైట్లు అన్నీ ఉంటాయి. కానీ మొదటి వారంలో అనవసరమైన వాటికే అతిగా ఆవేశపడటం కనిపించింది. అయితే ఇప్పుడిప్పుడే మిగిలిన ఎమోషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్‌లో హారికకు అభిజిత్ అంటే ఇష్టమని తేలిపోయింది. ఎంత ఇష్టం లేకపోతే హారిక అతడి దగ్గరకు వెళ్లి మరీ గోరు ముద్దలు తినిపిస్తుంది. కానీ వీరిది స్నేహమేనని భావిస్తున్నారు. ఎందుకంటే అభిజిత్‌కు మోనాల్ అంటే మరీ మరీ ఇష్టం.
మొదట్లో ఆమెను పట్టించుకోనట్లు కనిపించినా ఇప్పుడు ఆమెను వదిలి ఉండలేకపోతున్నాడు. తనతో మాట్లాడంటూ ఒట్టేయమని మోనాల్‌ను అభ్యర్థించాడు. ఎవర్నీ ప్రేమించట్లేదు కదా అని మనసులోని భయాన్ని బయటపెట్టేశాడు. అందుకు ఆమె లాంటిదేం లేదని చెప్పడంతో అతని మనసు తేలికపడింది. ఇప్పుడు ఆమెతో ఇంకా క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే స్టైలింగ్ ఐకాన్ అఖిల్ కూడా మోనాల్‌తో ముచ్చటించేందుకు సమయం కేటాయిస్తున్నాడు. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ క్లోజ్‌గా ఉంటున్నాడు. కానీ ఇది అభిజిత్‌కు ఏమాత్రం నచ్చట్లేదని అతడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది. దీంతో ఈ ఇద్దరి మధ్య మోనాల్ నలిగిపోతోంది.మొత్తానికి రేటింగ్ కోసం మోనాల్ ని బాగా వాడుకుంటన్నారు.