నేను కుర్రాడినే…పిల్లని చూస్తే పెళ్లి చేసుకుంటా – ముసలి టీచర్ ముచ్చట

Bihar's Love Guru Professor Retires At 65, wants To Remarry

అవును…నిజమేనండి…65 సవంత్సరాలు నిండినా తాను కుర్రాడినే, పిల్లని చూస్తే పెళ్లి చేసుకుంటా అంటూ తన ముచ్చట ని చెప్పుకుంటున్నాడు ఈ ముసలి టీచర్. టీచర్ అంటే సాదా సీదా బడిపంతులు కాదండోయ్. బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో సాక్షాత్తూ హిందీ అధ్యాపకుడు. ఆయన పేరు మకుట్ నాథ్. నిన్ననే రిటైర్ కూడా అయ్యాడులెండి. ఇప్పుడు ఇతని గురించి ఎందుకు చెప్మా అంటే ఈయన గారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందట. అందుకోసం పిల్ల ని చూసిపెట్టే బాధ్యత తన విద్యార్థులే స్వీకరించాలంట. ఆయన స్టూడెంట్స్ పైకి ఏమనుకున్నారో కానీ, లోలోపల ఎంత కసిగా తిట్టుకున్నారో మనం ఇట్టే ఊహించేయొచ్చు.

Matuk Nath

అన్నట్టు, ఈయన గతం కూడా భలే చిత్రంగా ఉంటుంది. పాట్నా యూనివర్సిటీ లోనే చదువుతున్న, తన కంటే ముప్పై ఏళ్ళు చిన్నదైనా జూలీ అనే అమ్మాయి కి ప్రేమలేఖలు రాసి, ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసరికి, 2006 లో పెళ్ళి చేసుకొని కాపురం పెట్టాడు. ఇక అప్పటితో ఈ మకుట్ నాథ్ కాస్త లవ్ గురు గా పేరు తగిలించుకున్నాడు. పోనీ, ఇంత చేసినా ఏరికోరి పెళ్లి చేసుకున్న జూలీ తో సరిగ్గా కాపురం చేశాడా అంటే అదీ లేదు. ఇలా ఈ లవ్ గురు తో పదేళ్లు కలిసుందో లేదో, సన్యాసం లో కలిసిపోతానని చెప్పి వెళ్ళిపోయిందంట (అంతగా ఏమి భయపెట్టాడో ఏమో). ఇంకా తన జ్ఞాపకాలను మరచిపోలేకపోయిన ఈ లవ్ గురుడు “మకుట్ జూలీ కి డైరీ ” అంటూ ఒక పుస్తకం రాసి, ప్రెస్ మీట్ పెట్టి మరీ విడుదల చేశాడు. ఇంతటితో లవ్ గురు అని కొంత మందికే తెలిసిన ఈయన గారి ముద్దు పేరు కాస్త దేశమంతటా మారుమోగిపోతుంది.

Bihar's Love Guru

ఇంతటితో ఆగాడా అంటే అది లేదు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు ఫేస్ బుక్ లో అలా పెట్టాడో లేదో, ఇలా బోలెడు పెళ్లి ప్రొపొసల్స్ వస్తున్నాయంట. ఆ కన్ఫ్యూషన్ తట్టుకోలేక… ఇక నావల్ల కాదు పిల్లలు, మీరే నాకు పిల్లని చూసి పెట్టండి అంటూ చాల పెద్ద భారాన్నే మోపాడు తన శిష్యుల మీద. ఇక ఏమవుతుందో ఏమో మున్ముందు చూడాలి.