బీహార్ నుంచే ఎవరెస్ట్ ను చూసే ఛాన్స్…

హిమాలయాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని దర్శించాలి అంటే  ఎవరికైనా అది అసాధ్యం. మంచుతో కప్పుకొని ఉన్న ఎవరెస్ట్ ను టీవీల్లో, సినిమాల్లో చూడటం తప్పించి రియల్ గా చూడటం అనేది చాలా తక్కువ. హిమాలయాల్లోకి వెళ్ళాలి అంటే మొదట ఫిట్నెస్ ఉండాలి. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ పర్వతాలు ఎక్కాలి అంటే ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని చాలా జాగ్రత్తగా గుండెధైర్యంతో ఎక్కాలి. అది మామూలు మనుషులకు సాధ్యమయ్యే పనికాదు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రస్తుతం ఇంట్లో కూర్చొనే చక్కగా హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ ను దర్శించుకోవచ్చు. టీవీలో కాదు. డైరక్ట్ గా ప్రత్యక్షంగా కళ్ళతోనే.  అది ఎలాగా అంటే.. బీహార్ లోని సింగ్ వాహిని గ్రామానికి చెందిన ప్రజలకు అది సుసాధ్యమైంది. ఆ గ్రామంలోని ప్రజల ఇళ్ల నుంచే సుదూరంగా ఉన్న హిమాలయ పర్వతాలు చాలా స్వచ్ఛంగా దర్శనమిస్తున్నాయి.

అంతేకాదు.. ఎవరెస్టు శిఖరం కూడా కనిపిస్తోంది. ఆ గ్రామానికి చెందిన రైతు జైస్వాల్ తమ గ్రామం నుంచి హిమాలయాలను, ఫోటో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ కావడంతో బీహార్ లోని ఆ గ్రామం పాపులర్ అయిపోయింది. కాగా లాక్ డౌన్ తర్వాత తిరిగి కాలుష్యం, దుమ్ము ధూళి ఏర్పడితే ఈ అరుదైన దృశ్యాన్ని తిరిగి మరలా చూడలేమని ఆమె వెల్లడించింది. ఎన్నో వందల ఏళ్ల తర్వాత వాతావరణం స్వచ్ఛంగా మారడంతో ఇలాంటి అరుదైన దృశ్యాలు ఎన్నో మనకు జ్ఞాపకాలుగా దర్శనమిస్తుండటం విశేషం.