మరో రెండువారాలు లాక్ డౌన్ పొడిగింపు..?

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 అమలులో ఉంది. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారమైతే.. ఈ నెల 17తో లాక్‌డౌన్ ముగుస్తుంది. అయితే.. ఉన్నట్టుండి రోజురోజుకూ విపరీతంగా కేసుల సంఖ్య పెరుగుతోన్న ఈ సమయంలో మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించాలనే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే కేంద్రం 17వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినా.. తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. దీన్నిబట్టి.. మే 17 తర్వాత కూడా ‘లాక్ డౌన్’ ను కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే లాక్‌డౌన్ 3.0 అమలవుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని మోడీ ఆ యా రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైన ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ గతంలో నిర్వహించిన వాటికంటే భిన్నంగా జరగడం విశేషం.  అలాగే… దేశంలో కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటం, ఎక్కువ మంది ముఖ్యమంత్రులతో ఈసారి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం వంటివి కారణంగా తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ సమయంలో సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారిగా చెప్పువచ్చు.

అంతేకాకుండా మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక అంశాలను ప్రస్తావనకు తెచ్చారు. అదేమంటే.. లాక్ డౌన్ పొడిగింపు, రైళ్ల రాకపోకలు, ఆర్థిక పరిస్థితి, కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలు వంటివాటిపై ప్రధానంగా మోడీ దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. కొన్ని రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధానికి సూచించగా.. మరికొందరు సీఎంలు లాక్‌డౌన్‌ను కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేయాలని.. లేనిపక్షంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని ప్రధాని ముందు తేల్చిసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆర్ధిక కార్యకలాపాల పునఃప్రారంభానికి సడలింపులతో కూడిన పలు నిర్ణయాలు తీసుకొనేందుకు రెడీ అవుతోంది కేంద్రం. అంతేకాకుండా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం.. నెమ్మదిగా, విడతల వారీగా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంపై ఫోకస్ పెట్టిన కేంద్రం.. త్వరలోనే తక్కువ సంఖ్యతో కూడిన మెయిన్ రూట్లలో దేశీయ విమాన సర్వీసులు కూడా కేంద్రం నడిపే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరి జరుగుతుంది అనేది మరోమారి మోడీ మీడియా మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.