ఇలా తయారయ్యారేంట్రా..బైక్​పై యువతి డేంజరస్ స్టంట్.. వీడియో వైరల్

Dangerous stunt of a young woman on a bike
Dangerous stunt of a young woman on a bike

ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ గోల కాస్త ఎక్కువైంది. ఒకప్పుడు ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రీల్స్ కోసం డేంజరస్ స్టంట్లు చేస్తూ ప్రాణాలు చేజేతులారా పోగొట్టుకుంటున్నారు. నెట్టింట రీల్స్ ట్రెండ్ మామూలుగా లేదు. అందుకే రీల్స్ చేసి పాపులారిటీ తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న యువత.. దాని కోసం ప్రాణాలను పణంగా పెడుతోంది. కదులుతున్న రైలుకు ఎదురుగా నిలబడి, ఎత్తైన కొండ అంచుకువెళ్లి రీల్స్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఓ యువతి రాత్రి పుట రెండు చేతుల్లో 2 గన్‌లను పట్టుకొని, వేగంగా వెళ్తున్న బైక్‌పై నిల్చొని స్టంట్‌ చేస్తూ, కెమెరాకు ఫోజులిచ్చిన ఘటన తాజాగా బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. పాపులారిటీ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. బైక్‌పై వెళ్తున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ తెలిపారు.