పశ్చిమ బెంగాల్లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు డొమోహని వద్ద అదుపుతప్పింది. రైలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకున్నారు. దీంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు.
స్థానికుల సహయంతో క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఐదుగంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.