అత్తాపూర్ పిల్లర్ నంబర్ 143 వద్ద రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా అత్తాపూర్ వద్ద ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి కారణమైన బైక్ ఓనర్ రాజు తన ఫ్రెండ్ అయిన శివ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు బైక్ తన లైసెన్స్ ఆర్సీ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.