బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. తొలి రోజు జపాన్ చేతిలో 0–3తో ఓడిపోయిన టీమిండియా… రెండో రోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లోనూ 0–3తో పరాజయం పాలైంది.
తొలి సింగిల్స్‌లో రియా భాటియా 1–6, 3–6తో లిన్ జూ చేతిలో… రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 319వ ర్యాంకర్ అంకిత రైనా 4–6, 2–6తో ప్రపంచ 97వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సౌజన్య బవిశెట్టి–రుతుజా బోస్లే జోడీ 5–7, 1–6తో జు యిఫాన్– జావోజువాన్ యాంగ్ జంట చేతిలో ఓడిపోయింది.