నానికి బైపోలార్‍ డిజార్డర్‍

నానికి బైపోలార్‍ డిజార్డర్‍

నాని మతిమరపు పాత్ర పోషించిన ‘భలే భలే మగాడివోయ్‍’ పెద్ద హిట్టయింది. హీరోగా తన కెరియర్‍ని మలుపు తిప్పింది కూడా ఆ చిత్రమే. అయితే మళ్లీ ఆ తరహా డిజార్డర్‍ వున్న పాత్రలేవీ నాని చేయలేదు. ‘టక్‍ జగదీష్‍’లో నాని బైపోలార్‍ డిజార్డర్‍ వున్న క్యారెక్టర్‍ చేస్తున్నాడని మీడియాలో బాగా వినిపిస్తోంది. ఈ వదంతులని నాని ఖండించాడు.

తాను ‘టక్‍ జగదీష్‍’గా వినోదాత్మక పాత్ర చేస్తున్నానని, జగదీష్‍కి ఎలాంటి డిజార్డర్స్ వుండవని స్పష్టం చేసాడు. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మొదటి రెండు సినిమాలలో మెచ్యూర్డ్ లవ్‍స్టోరీస్‍ చూపించాడు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలలో క్లాస్‍ ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టిన శివ ‘టక్‍ జగదీష్‍’ని మాత్రం మాస్‍ ఎంటర్‍టైనర్‍గా తీర్చిదిద్దుతున్నాడట.

లాక్‍డౌన్‍ ముందే చాలా వరకు షూటింగ్‍ పూర్తి చేసిన శివ నిర్వాణ ఈ గ్యాప్‍లో పాటలకు తగిన సిట్యువేషన్స్ రాసుకున్నాడట. ఇంతకుముందు పాట కోసం పాట అన్నట్టుగా వున్న స్క్రీన్‍ప్లేలో ఇప్పుడు సాంగ్స్ ప్లేస్‍మెంట్‍కి చక్కని సందర్భాలు కుదిరాయట. ఈ చిత్రం పట్ల నాని చాలా కాన్ఫిడెంట్‍గా వున్నాడు. థియేటర్లు తెరవగానే ‘వి’ రిలీజ్‍ అవుతుంది కాబట్టి హడావిడిగా ‘టక్‍ జగదీష్‍’ పూర్తి చేయాల్సిన టెన్షన్‍ తనకుండదు. రెండు సినిమాల మధ్య కనీసం మూడు, నాలుగు నెలల విరామం వుంటుందట.