పకోడీలు, బజ్జీలు, టీ, కాఫీ లేని వానాకలం సాయత్రం గడవదు కానీ మనందరం గుర్తు పెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం వానాకలం తనతో పాటూ కొన్ని ఆరోగ్య సమస్యలని కూడా తీసుకు వస్తుందని. ఈ సమయంలో మనం తీసుకునే ఫుడ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ గా ఉండడమే కాదు, గట్కి కూడా హెల్ప్ ఫుల్‌గా ఉండాలి. కాబట్టి, పకోడీలతో పాటూ ఇవి కూడా తీసుకోవడం మర్చిపోకండి.
సీజనల్ ఫ్రూట్స్ – బొపాయి, లిచీ, యాపిల్స్, పియర్స్ వంటి సీజనల్ ఫ్రూట్స్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలని కూడా అందిస్తాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్, విటమిన్స్ అందుతాయి. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
వెల్లుల్లి – హ్యూమన్ బాడీ యొక్క మెటబాలిజంని మెయింటెయిన్ చేసే సూపర్ ఫుడ్స్‌లో వెల్లుల్లి కూడా ఒకటి. పప్పు, రసం, సాంబారు, సాస్ వంటి వాటిలో వెల్లుల్లిని కలపడం ద్వారా మనం దీని రోజూ తీసుకోగలం. ప్రతి ఇండియన్ కిచెన్‌లోనూ ఉండే వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వంటి దినుసులు మనని కామన్ కోల్డ్, ఫ్లూ నించి ప్రొటెక్ట్ చేస్తాయి.
చేదు – మెంతికూర, కాకర కాయ వంటి వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులని అడ్డుకునే శక్తి మనకి వస్తుంది. ఇవి విటమిన్స్ ఏ, సీ, బీ, ఐరన్, జింక్‌తో నిండి ఉంటాయి.పెరుగు – గట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒక ప్రోబయాటిక్ ఇంగ్రీడియెంట్ మీ ఆహారంలో ఉండి తీరాలి. ఇది పాథోజెన్స్ ని దూరంగా ఉంచుతుంది. పెరుగు లో ఉండే మంచి బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్స్ హి హెల్దీగా ఉంచుతుంది.
తేనె – తేనె అరుగుదలకి సహకరిస్తుంది, బాడీకి కావాల్సిన శక్తినిస్తుంది. అంతే కాక తేనెలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వలన తేనె తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.నీరు – వీటన్నింటి తో పాటూ తప్పని సరిగా, గుర్తు పెట్టుకుని మరీ తీసుకోవాల్సిన పదార్ధం మంచి నీరు. నీటిని కాచి చల్లార్చి కానీ ఫిల్టర్ చేసి కానీ తాగాలి. నీరు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. మీకు కావాలనుకుంటే ఆరెంజ్, కీరా, పుదీనా కూడా మీరు తాగే నీటికి కలుపుకుని తాగవచ్చు.