Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బాధితులంతా తాము కష్టాల్లో ఉంటే.. తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు రిసార్ట్ కు ఎందుకు తరలించారని రాహుల్ ని నిలదీశారు. అంతే కాదు రాహుల్ కాన్వాయ్ పై రాళ్లు కూడా పడ్డాయి. దీంతో రాహుల్ మౌనంగా వెనక్కివచ్చారు.
అయితే రాహుల్ పై దాడికి ఆయన స్పందించకపోయినా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఘాటుగా రియాక్టయ్యారు. బీజేపీ, ఆరెస్సెస్ స్కెచ్ లో భాగంగానే ఇలా జరిగిందని కామెంట్ చేశాయి. కానీ వారి కంటే ముందే రియాక్టైన బీజేపీ.. రాహుల్ పై దాడి దురదృష్టఘటన అని వ్యాఖ్యానించింది. ఎవరూ మాట్లాడకముందే బీజేపీ ముందే భుజాలు తడుముకోవడాన్ని రాహుల్ టార్గెట్ చేశారు.
తనపై దాడి చేసిన వారే.. తన కంటే ముందే స్పందించారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ ఫస్ట్ రియాక్షనే తనపై దాడి చేసింది ఎవరో చెప్పకనే చెబుతోందన్నారు రాహుల్. దీంతో బీజేపీ నేతలు కాస్త ఇరుకున పడ్డారు. ముందు స్పందిస్తే.. సేఫ్ అవుతామనుకుంటే.. రాహుల్ ఇలా ఇరుకున పెట్టారేంటని కిందా మీదా పడుతున్నారు.