Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ నేతలు చెప్పే మాటలకు, చేసే పనులకూ చాలా తేడా ఉంటుంది. అదేమంటే పార్టీని సంతృప్తి పరిచాలని కబుర్లు చెబుతారు. కానీ అందరి సీఎంలకు భిన్నమని పేరు తెచ్చుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్… ఈ విషయంలో మాత్రం అందరి లాంటి వాడినేనని నిరూపించుకున్నారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను కొన్నాళ్లకే బదిలీ చేసి అపవాదు మూటగట్టుకున్నారు.
గత వారం బులంద్ షహర్లో శ్రేష్ఠ ఠాకూర్ అనే పోలీస్ ఆఫీసర్ బీజేపీ కార్యకర్తలకు ముచ్చెమటలు పట్టించారు. సరైన పత్రాల్లేకుండా ప్రయాణిస్తున్నారని బీజేపీ నేతల వాహనాలు నిలిపేశారు. దీంతో కాషాయ నేతలు ఆమెపై గొడవకొచ్చారు. దీంతో సీఎం దగ్గరకు వెళ్లి పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని రాయించుకురావాలని లేడీ సింగం గద్దించడంతో.. తోకముడిచారు.
కానీ శ్రేష్ఠ ఠాకూర్ పై కక్ష పెంచుతున్న బులంద్ షహర్ బీజేపీ నేతలు.. ఆమెను దూర ప్రాంతానికి బదిలీ చేయించారు. ఠాకూర్ తో పాటు చాలా మంది అధికారులు బదిలీ అయ్యారు. కానీ ఆమె బ్యాట్ మేట్స్ ఎవరూ ట్రాన్స్ ఫర్ కాలేదు. పైగా శ్రేష్ఠ ఇప్పుడు పని చేస్తున్న చోటుకు వచ్చి ఎనిమిది నెలలే అయింది. అయినా సరే ట్రాన్స్ ఫర్ కావడం పొలిటికల్ ప్రెజర్ ఫలితమేనని స్థానిక బీజేపీ నేతలు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. బీజేపీ అందిస్తామన్న సుపరిపాలన ఇదేనేమో.
మరిన్ని వార్తలు