లాలూ అడ్డాలో అంతేనా..?

JP Deputy CM Lalu's son Tejaswi Yadav Personal Security Beturn Media People

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

BJP Deputy CM Lalu’s son Tejaswi Yadav Personal Security Beturn Media People

బీహార్లో నితీష్ సీఎం అయ్యాక క్రైమ్ రేట్ తగ్గిపోయిందని అందరూ చెబుతున్నారు. కానీ స్వయంగా డిప్యూటీ సీఎం సమక్షంలో మీడియాపై పట్నాలో దాడి జరిగింది. దీంతో అందరికీ మరోసారి పాతరోజులు గుర్తొచ్చాయి. నితీష్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటుంటే.. ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం, లాలూ తనయుడు తేజస్వి మాత్రం తన గ్యాంగ్ తో మీడియాపై దాడి చేయించాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ తేజస్వి రాజీనామానే. ఎలాగైనా రాజీనామా చేయించాలని జేడీయూ, చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోపణలపై జనానికి వివరణ ఇవ్వాలని సీఎం, తేజస్విని కోరారు. దీంతో తేజస్వి కూడా సీబీఐ ఆరోపించిన టైమ్ లో తాను మైనర్ నని, ల్యాండ్ స్కామ్ ఎలా చేస్తానని అమాయకంగా ప్రశ్నించారు.

అయితే సెక్రటేరియట్ నుంచి బయటికొస్తున్న తేజస్విని ప్రశ్నించడానికి మీడియా రెడీ అవ్వగానే.. ఆయన సొంత సిబ్బంది పైత్యం చూపించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధుల్ని లాగి పడేయడమే కాకుండా.. పక్కకు తీసుకెళ్లి మరీ రక్తం వచ్చేలా కొట్టారట. ఈ ఘటనతో జేడీయూ, ఆర్జేడీ మధ్య వివాదం మరంత ముదిరింది. లాలూ అనవసరంగా కొరివితో తల గోక్కుంటున్నారని దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు :

ఢిల్లీ వెళ్తున్నారా.. కెమెరాలు చూసుకోండి