దీదీని కెలుకుతున్న బీజేపీ

bjp-disturbing-bengal-cm-mamata-benarji-with-religous-politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

BJP Disturbing Bengal CM Mamata Benarji With Religous Politics

బెంగాల్లో అధికారం కోసం మమత గతంలో చాలా దారుణమైన పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రంట్ సర్కారును కూల్చడానికి కొన్ని అరాచక పద్ధతుల్లో వెళ్లారు. అయినా సరే సామాన్యురాలిగా ఉన్న గుడ్ ఇమేజ్ తో మమత సీఎం పీఠం అధిష్ఠించారు. కానీ ఇప్పుడు బీజేపీ దీదీ రూట్ ఫాలో అవుతోంది.

అధికారం కోసం నీ రూట్లోనే వస్తామంటున్న బీజేపీ నేతలు.. మమతకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఓవైపు గూర్ఖాల ఉద్యమం, మరోవైపు ఫేస్ బుక్ పోస్ట్ దుమారంతో బెంగాల్ అట్టుడికిపోతోంది. ఎన్ని కేంద్ర బలగాలు వచ్చినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీంతో అంతా కేంద్రమే చేయిస్తోందని మమత మండిపడుతున్నారట.

ఇలాంటి సమయంలో బెంగాల్ పరిస్థితిని భోజ్ పురి రేప్ సీన్ తో పోలుస్తూ బీజేపీ మహిళా నేత పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదని ఆమె మండిపడ్డారు. దీంతో మరోసారి మత రాజకీయంతో బెంగాలీల మనసు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోందని మమత అలర్టయ్యారు. కానీ ప్రస్తుతం దీదీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మరి గుడ్ టైమ్ ఎప్పుడొస్తుందో.

మరిన్ని వార్తలు:

రావెల మీద డౌట్ పెంచిన మందకృష్ణ.

మెలానియాకు గృహ నిర్భంధం