మెలానియాకు గృహ నిర్భంధం

American president Trump wife Melania has home arrest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

American president Trump wife Melania has  home arrest

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియాకు గృహ నిర్భంధం తప్పలేదు. రాజకీయ ఖైదీలకు విధించే శిక్ష ఆమెకు ఎందుకు అనుకుంటున్నారా.. సెక్యూరిటీ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది మరి. ట్రంప్ చేసే తింగరి పనులకు మెలానియా కూడా శిక్ష అనుభవించాల్సి వస్తోంది.

తెంపరి ట్రంప్ తన దుందుడుకు ధోరణితో వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు కానీ మెలానియా మాత్రం ఎక్కడికెళ్లినా హుందాగానే ఉంటున్నారు. కానీ జర్మనీలో మాత్రం అలా కుదరలేదు. సెక్యూరిటీ రీజన్స్ కోసం ఆమెను గెస్ట్ రూంలోనే ఉండిపోవాలని భద్రతా సిబ్బంది కోరారట. అయితే మిగతా దేశాల అధ్యక్షుల సతీమణులు కూడా ఉండటంతో మెలానియా బాగానే టైమ్ పాస్ చేశారట.
ప్రతిసారీ జీట్వంటీ మీటింగ్ సమయంలో కొన్ని దేశాల పౌరులు ఆందోళన చేయడం కామన్. కానీ ఈ సారి ట్రంప్ కు మాత్రం నిరసన సెగ కాస్తంత ఎక్కువగానే ఉంది. అందుకే మెలానియాను బయటకు పంపితే.. ఆమెపై దాడులు జరుగుతాయన్న భయంతో.. సెక్యూరిటీ ఈ పని చేశారు. అయితే మెలానియా మాత్రం పెద్ద మనసుతో విషయం అర్థం చేసుకున్నారట.

మరిన్ని వార్తలు:

డ్రగ్స్ క్యాపిటల్ గా హైదరాబాద్

రావెల మీద డౌట్ పెంచిన మందకృష్ణ.