తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకుగానూ 2 సీట్లును గెలుచుకుని తమ రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియమాకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.