ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే జన్ మేజయ సింగ్ (75) గురువారం అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర అవ్వస్థతతో బాధపడుతున్న ఆయనను మొదట సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎమ్మెల్యే ఆరోగ్యం పూర్తిగా విషమించింది.
ఆయనకు ఫేస్ మేకర్ అమరుస్తుండగా తీవ్ర గుండెనొప్పి రావడంతో చనిపోయినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే మేజయ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఎంతో అంకితభావంతో నియోజకవర్గ అభివృద్ధికి సింగ్ కృషి చేశారని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకోసం చాలా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన మరణం పార్టీకి, నియోజకవర్గానికి తీరని లోటని యోగి పేర్కొన్నారు.