Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎందరో సినీ అభిమానులకి డ్రీమ్ గాళ్, , బిజెపి ఎంపీ హేమమాలినికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె నిన్న తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి తన కాన్వాయ్ తో సహా బయలుదేరారు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు, ఉరుముల కారణంగా ఓ చెట్టు విరిగి ఆమె కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందొచ్చినా ఆ చెట్టు కారుపై పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు.
తరువాత ఆ చెట్టును తొలగించి రహదారిని క్లియర్ చేశారు. బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం హేమమాలిని మాంట్ తహశీల్‌లోని మిథౌలీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కఢ ఆమె ప్రసంగిస్తుంన్నంతలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె కాన్వాయ్ కొద్ది దూరం వెళ్లగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ ప్రమాదాన్ని ముందుగానే గమనించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.నిన్న సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు, ఇసుక తుపానుల ధాటికి 53 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదం నుండి డ్రీం గర్ల్ బయటపడడం తో అభిమానులతో పాటు బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.