జగన్ ఓట్ బ్యాంకు కి బీజేపీ ఎంపీ గండి…

BJP MP Savithri Bai Phule To Rally against Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో ఎక్కడ ఏ నిర్ణయం ఏ మలుపుకి దారి తీస్తుందో చెప్పలేం. అందుకు తాజా ఉదాహరణ ఒకటుంది. బీజేపీ లో మోడీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతున్న ఆ పార్టీ మహిళా ఎంపీ మున్ముందు వైసీపీ అధినేత జగన్ ఓట్ బ్యాంకు కి భారీగా గండి కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే కాస్త ఉత్తర్ ప్రదేశ్ దాకా వెళ్లి రావాల్సిందే.

సావిత్రి భాయ్ పూలే… ఉత్తరప్రదేశ్ లోని బహ్రయిచ్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున గెలిచిన ఎంపీ. నాలుగేళ్లుగా బీజేపీ రాజకీయాలను, ఆ పార్టీని ఆదేశించే స్థాయిలో వున్న rss ని దగ్గరగా చూసిన సావిత్రి భాయ్ పూలే కి ఓ విషయం బాగా అర్ధం అయ్యింది. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ లకు కొనసాగుతున్న రిజర్వేషన్స్ మీద బీజేపీ కి కన్నుపడిందట. ఆ రిజర్వేషన్స్ కి ఏదో విధంగా గండి కొట్టేలా బీజేపీ లో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్న సావిత్రి భాయ్ సొంత పార్టీ వైఖరికి వ్యతిరేకంగా లక్నోలో ఓ భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు చెప్పారు. త్వరలో జరిగే ఈ ఆందోళనతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాల్లో చర్చ జరగడం ఖాయం. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీలు బీజేపీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తరచి చూస్తే బీజేపీ తో లోపాయికారి రాజకీయాలు చేస్తూ మోడీ ప్రాపకం కోసం వైసీపీ తెగ ప్రయత్నం చేస్తున్న అంశం అందరికీ అర్ధం అవుతోంది. ఇప్పుడు టీడీపీ కూడా nda నుంచి తెగదెంపులు చేసుకోవడంతో అందరి కన్ను వైసీపీ వ్యవహారశైలి మీద పడింది. వైసీపీ కి కిందటి ఎన్నికల్లో తిరుగులేని మద్దతు ఇచ్చిన ఎస్సీ, మైనారిటీ వర్గాలు జగన్ రాజకీయ వ్యూహాల మీద ఇప్పటికే అసంతృప్తిగా వున్నాయి. ఇప్పటికే ముస్లిం మైనారిటీ నేతలు చాలా మంది వైసీపీ వైఖరిని తప్పుబడుతూ వైసీపీ కి దూరం అవుతున్నారు. ఇక తమ రిజర్వేషన్స్ కి ఎసరు పెడుతున్న బీజేపీ కి మద్దతు ఇచ్చే వైసీపీ కి అండగా ఎస్సీలు నిలిచే ఛాన్స్ లేదు. అక్కడ యూపీలో సావిత్రి భాయ్ పూలే ఆందోళన తీవ్ర రూపం దాల్చే కొద్దీ ఇక్కడ ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంకు కి గండి పడే అవకాశాలు ఎక్కువే.