Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటోంది. సర్వేలన్నీ ఇంకోసారి బీజేపీ గెలుపు తధ్యం అని చెబుతున్నా పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోల విడుదల తో కమలనాథులకు విజయం మీద నమ్మకం లేదు అనిపిస్తోంది. నిజానికి ఆ వీడియోలతో హార్దిక్ పటేల్ కి జరిగిన నష్టం కన్నా బీజేపీ కి జరిగిన నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఏదైనా నష్టం జరుగుతుంది అనుకుంటే ఎవరైనా భయపడతారు. కానీ నష్టం జరిగిపోతే ఇంతే కదా అని ధైర్యం పెరుగుతుంది. ఇప్పుడు బీజేపీ చేసిన పనితో హార్దిక్ పటేల్ కి తెగింపు వచ్చింది. ఆయన బీజేపీ ఓటమి ధ్యేయంగా పని చేస్తున్నాడు. ఇక హార్దిక్ విషయంలో బయటపడ్డ సీడీని గుజరాతీలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీన్ని ఓ కుర్ర చేష్టగా తీసుకుంటున్నారు తప్ప ఓ మహా నాయకుడు పెద్ద తప్పు చేసినట్టు ఎవరూ ఫీల్ అవడం లేదు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని హార్దిక్ ఏదైనా పదవులు లేదా ఇతరత్రా రాజకీయ లబ్ది పొంది ఉంటే గనుక జనంలో వ్యతిరేకత వచ్చేదేమో గానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు.
ఇక హార్దిక్ పటేల్ సీడీ ల విడుదల తర్వాత బీజేపీ మీద ఈ విషయంలో దాడి ఉధృతమైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధి పేరు చెప్పి దేశ ప్రజల ఓట్లు కొల్లగొట్టిన బీజేపీ ఇప్పుడు గుజరాత్ లో బ్లూ ఫిలిం చూపించి గెలవాలి అనుకుంటోంది అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఇదే తరహాలో దాదాపు అన్ని పార్టీలు బీజేపీ చేసిన పనిని తప్పుబడుతున్నాయి. హార్దిక్ కూడా ఊహించని స్థాయిలో అతనికి మద్దతు లభిస్తోంది. పరిస్థితి అర్ధం అయ్యాక ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటే బాగుండని బీజేపీ కూడా అనుకుంటోందట. అయితే అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే వుంది.