బహిరంగ సభకు నిరాకరించిన బిజేపి

బహిరంగ సభకు నిరాకరించిన బిజేపి

ఈరోజు గుంటూరు జిల్లా గురజాలలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ బహిరంగ సభకు పోలీసులు నిరాకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి గురజాల పోలీసులు చేరుకున్నారు.  కన్నా లక్ష్మీనారాయణను బహిరంగ సభకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. కన్నాకు నోటీసులు ఇచ్చేందుకు గురజాల సీఐ రామారావు ప్రయత్నించగా కన్నా లక్ష్మీనారాయణ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. 144 సెక్షన్‌ నేపథ్యంలో పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు.