త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి స్థానికంగా ఉన్న వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి, వరదనీరు పాఠశాలలోకి ప్రవేశించింది. వందలాది మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని బస్సుల ద్వారా బయటకు తరలించేందుకు గురుకుల సిబ్బంది చేసిన ప్రయత్నం విఫలమైంది. విద్యార్థులను కాపాడేందుకు వచ్చిన బస్సులు కూడా వరదలో చిక్కుకున్నాయి. పరిస్థితిని గమనించిన పడకండ్ల గ్రామస్థులు రంగంలోకి దిగి నిచ్చెన్ల ద్వారా పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను అక్కడి నుంచి సురక్షితంగా కాపాడారు.