రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంగ్రెస్ పార్టీ కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ, రాజ‌కీయ వేత్తలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా కలిసి పోరాడదామని.. అందుకు తమతో కలిసి రావాల్సిందిగా రేవంత్‌ రెడ్డిని పవన్ కల్యాణ్ కోరారు. అందులో భాగంగానే సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ద‌స్ప‌ల్లా హోట‌ల్‌లో నిర్వ‌హించనున్న అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ రెడ్డిని పవన్ ఆహ్వానించారు. ప‌వ‌న్ కల్యాణ్ ఆహ్వానాన్ని మన్నించిన రేవంత్.. తాను సమావేశానికి వస్తానని ఒప్పుకున్నారు