బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి

తెలుగులో నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో సరదాగా సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి,పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు.  ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌ మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.మరోవైపు మహేష్ విట్టా.. శ్రీముఖిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తీరు నవ్వు తెప్పించింది. మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లోని సభ్యులని అలరించింది.  తాజాగా ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రక్రియలో రెండు వారాల క్రితం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి  8వ వారం నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌  నుంచి ఎలిమినేట్ చేసాడు.