జగన్ కుటుంబం పై బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ కుటుంబం పై బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయ వర్గాల్లో గత కొఞ్చ కాలం నుంచి వైసీపీకు చెందిన మంత్రి బొత్స సత్యన్నారాయణ చేస్తున్న కామెంట్స్ పెద్ద ఎత్తున సంచలనాన్ని రేపాయి.రాజాధాని అమరావతి విషయంలో కానీ ఇతర ఏ అంశాల్లో అయినా సరే బొత్స మైక్ ముందు మాట్లాడితే అది అలా హాట్ టాపిక్ గా మారిపోతుంది.దీనితో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బొత్స మరియు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా బొత్స కామెంట్స్ పై టీడీపీకు చెందిన నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.అసలు బొత్స ఏం మాట్లాడుతారో కూడా ఆయనే తెలీదని ఆయన మాట్లాడే మాటలు విలేఖరులకు అర్ధం కూడా కావని అన్నారు.అంతే కాకుండా ఇప్పుడు బొత్స చేస్తున్న కామెంట్స్ అన్నిటి వెనుక జగనే ఉన్నాడని గతంలో బొత్స కాంగ్రెస్ లో ఉన్నపుడు విజయమ్మ,షర్మిలల మీద ఎన్నో దారుణమైన కామెంట్స్ చేసారని అయినా సరే జగన్ బొత్సాను తన పక్కన పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసారు.