బాలీవుడ్ లో భారీ ఎత్తున సైరా

బాలీవుడ్ లో భారీ ఎత్తున సైరా

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి” సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.దాదాపు 200 కోట్లు దాటి బడ్జెట్ అయ్యిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.స్వాతంత్య్రం రాక ముందే ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ విజువల్ పీరియాడికల్ డ్రామా తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియన్ చిత్రంగా రిలీజ్ అవుతుంది.

ఇదిలా ఉండగా ఈ నెల 18న జరగబోతున్న భారీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులుగా పవన్,రాజమౌళి,కేటీఆర్ లాంటి వారు వస్తున్నారని కూడా నిన్ననే తెలియజేసారు.ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఇది వరకే దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపారు.అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా భారీగానే విడుదల కాబోతున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

అదే రోజున బాలీవుడ్ నుంచే మరో భారీ సినిమా అయినటువంటి “వార్” సినిమా ఉన్నా సరే ఒక్క సైరా హిందీ వెర్షన్ 2000 స్క్రీన్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.ఇది చిరు కెరీర్ లోనే హిందీ భాషలో భారీ ఎత్తున విడుదల అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్,కిచ్చ సుదీప్ మరియు విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటులు నటించిన ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.