ప్రపంచ బ్యాట్మింటన్ తెలుగు తేజం పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహుమతి

ప్రపంచ బ్యాట్మింటన్ తెలుగు తేజం పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహుమతి

ప్రపంచ బ్యాట్మింటన్ యువనికపై మన భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మన తెలుగు తేజం పీవీ సింధు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలవటం జరిగింది.బ్యాడ్మింటన్‌ ప్రపంచg చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఆమెకి ముఖ్యమంత్రి కార్యాలయం తరుపునుండి ఘనంగా సన్మానించారు. స్వయంగా జగన్ పుష్పగుచ్ఛము ఇచ్చి ఆమెకి అభినందనలు తెలియచేశాడు.

సందర్భంగా సింధు మాట్లాడుతూ జగన్ గారికి కలవటం చాలా సంతోషంగా ఉంది. పద్మభూషణ్ కి నా పేరు సిఫారస్సు చేయటం చాలా సంతోషంగా అనిపిస్తుంది, వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ హాజరయ్యాడు. ఇక సింధు జగన్ ని కలిసిన సమయంలో ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.