మరోసారి బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ నిర్ణయం

మరోసారి బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ నిర్ణయం

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ బిగ్ బాస్ చెప్పిన పని చేయటం వారి విధి. టాస్క్ ఎలాంటిది అయిన రూల్స్ ఎలా ఉన్న కానీ, బిగ్ బాస్ మాటను తిరస్కరించే ఛాన్స్ ఎవరికీ లేదు. కానీ మొన్నటి టాస్క్ లో పునర్నవి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మీద విమర్శలు చేసింది, ఆ టాస్క్ ఒక పనికిమాలిన టాస్క్, రూల్స్ ఒకరి ఒకలా ఇంకొకరికి మరోలా ఇచ్చి టాస్క్ ఆడమంటే నేను ఆడను.. కావాలంటే నువ్వే వచ్చి ఆడుకో బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కి ఎదురుతిరిగింది పునర్నవి .

ఆ తర్వాత మరో ఎక్సట్రా టాస్క్ లో కూడా బిగ్ బాస్ చెప్పిన పనిని పునర్నవి చేయలేదు. శ్రీముఖి, మహేష్ ఇద్దరు కూడా తమ తమ టాస్క్ పూర్తిచేసిన కానీ పునర్నవి టాస్క్ చేయటానికి ఒప్పుకోలేదు. కొన్ని గంటల మిగిలిన హౌస్ మేట్స్ అందరు కూడా పునర్నవికి చెప్పి చెప్పి విసిగిపోయారు, చివరికి వరుణ్ వచ్చి చాలాసేపు చెప్పిన తర్వాత ఫైనల్ గా టాస్క్ చేయటానికి ఒప్పుకుంది, ఇక టాస్క్ అయిన తర్వాత చివరిలో బిగ్ బాస్ కి చెపుతూ టాస్క్ అయ్యింది,సారీ బిగ్ బాస్ మీతో వాదన పెట్టుకున్న రియల్లీ సారీ.. కానీ మీరు పెట్టిన టాస్క్ నాకు నచ్చలేదంటూ చెప్పింది.

అసలు ముందు టాస్క్ చేయనని తెగేసి చెప్పిన పునర్నవి చివరికి వరుణ్ మాటలు విని చేయటానికి ఒప్పుకుంది, అప్పటికే బిగ్ బాస్ ఆమెకి చాలా సమయం ఇచ్చాడు, అప్పటికి ఆమె ఒప్పుకోకపోయి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవి, ఇక పునర్నవి ఇష్యూ అయిపోయిన జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వితిక గెలిచి అయ్యి సీజన్ 3 తెలుగు బిగ్ బాస్ లో మొదటిసారి కెప్టెన్ అయ్యింది.