మరో కొత్త సినిమాతో రాబోతున్న యువ కథానాయకుడు

మరో కొత్త సినిమాతో రాబోతున్న యువ కథానాయకుడు

టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అతికొద్ది మంది హీరోలు మాత్రమే తమ మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నారు.అలాంటి హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు.అయితే ఆరంభం బాగానే దొరికినా తర్వాత తడబాట్లు తప్పలేదు.అలాగే సరైన హిట్ అందుకొని కూడా చాలా కాలమే అయ్యింది.దీనితో అసలు రాజ్ తరుణ్ సినిమాలు చేస్తున్నాడా లేదా అన్న అనుమానం చాలా మందిలో కలిగింది.అయితే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

రాజ్ తరుణ్ హీరోగా “అర్జున్ రెడ్డి” బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా కృష్ణా రెడ్డి గంగదాసు దర్శకత్వంలో ఓ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ లోనే మొదలు పెట్టారు.ఈ చిత్రానికి “ఇద్దరి లోకం ఒకటే” అని టైటిల్ ను కూడా పెట్టారు.దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యొక్క సాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.