Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేచే ప్రత్యర్థుల కన్నా మిత్రపక్షంలోని ఆ నేత మాటకు పదును ఎక్కువ. ఆ పదునైన మాటలతో బీజేపీ, టీడీపీ పొత్తుని తెగ్గోద్దామని ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆ మాటల వెనుక rss హస్తం ఉందని ఆయనే చెప్పుకుంటారు. అందులో నిజం వుందో,లేదో ? ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో ,లేదో గానీ నిత్యం వార్తల్లో మాత్రం నిలుస్తుంటారు. ఇంతకీ ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోము వీర్రాజు. అవడానికి బీజేపీ నేతే అయినా తమ మిత్రపక్షం టీడీపీ ని ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోరు.
ఆ వూపులోనే ఇటీవల గుజరాత్ ఎన్నికల ఫలితాలను కూడా ఆయన వాడుకున్నారు. అసలు మోడీ , అమిత్ షా నే గుజరాత్ ఫలితాలు తరువాత లోపల్లోపల వుడికిపోతుంటే ఈయన మాత్రం దమ్ముంటే బీజేపీ తో పొత్తు వదులుకోవాలని టీడీపీ కి సవాల్ విసిరారు. గుజరాత్ ఫలితాలకి సోము మాటలకు ఎక్కడా పొంతన లేదు. ఈయన గారి మాటలకు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది.
సోముతో పాటు ఆయన్ని సమర్ధించే చాలా మంది ఈ దెబ్బతో టీడీపీ తో బీజేపీ పొత్తు తెగిపోతుందని చంకలు గుద్దుకున్నారు. అయితే వాళ్ళు అనుకున్నట్టు మ్యాటర్ బాగా సీరియస్ అయ్యింది. హైకమాండ్ కి సోము కామెంట్స్ యాజిటీజ్ గా చేరిపోయాయి. అక్కడ నుంచి తలంటు పోశారట. అసలే వున్న మిత్రపక్షాలు దూరం అవుతుంటే మిగిలిన వాటిని దూరం చేస్తావా అని నిలదీయడంతో సోము కి నోట మాట రాలేదట. అబ్బే నేను అలా అనలేదని వివరణ ఇచ్చినా ముందుగా ఆ స్టేట్ మెంట్ మీద క్లారిటీ ఇచ్చాక మాట్లాడమని ఢిల్లీ నేత గట్టిగా హెచ్చరించడంతో సోము గారు నేల మీదకు వచ్చారు.
“ తెలుగు దేశం మా మిత్రపక్షం. రెండు పార్టీలు బలం పుంజుకుంటేనే ఇద్దరికీ మేలు జరుగుతుంది. నేను టీడీపీ కి,చంద్రబాబుకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా మాటలను వక్రీకరించారు . బీజేపీ ని బలోపేతం చేస్తాం. కేంద్ర నిధులతో 2019 కి పోలవరం పూర్తి చేస్తాం “…మంగళవారం ఏలూరు లో విలేకరులతో సోము మాట్లాడిన మాటలు ఇవి. తలంటు పోయకపోతే సోము గారు ఇలా మాట్లాడడం ఎప్పుడైనా చూశామా ? ఆయనకు హైకమాండ్ తలంటింది అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం కావాలా ?.